రైట్ రైట్


Mon,October 14, 2019 03:58 AM

-70 ఆర్టీసీ, 23 అద్దె బస్సులు
-బస్సుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలు
-అదనపు సీసీ కెమెరాల ఏర్పాటు
-బస్టాండ్‌లో భారీ బందోబస్తు


జనగామ టౌన్ : ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు జిల్లా అధికారులు జనగామ డిపో నుంచి తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లతో ఆదివారం 93 బస్సులను నడిపించినట్లు జిల్లా రవాణాశాఖ అధికారి రమేశ్‌రాథోడ్, డిపో మెనెజర్ భూక్య ధరంసింగ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాత్కాలిక సిబ్బందితో డిపోలోని అన్ని బస్సులను గ్రామీణ ప్రాంతాలకు నడిపించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో జిల్లాకు కేటాయించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ, అద్దె, ప్రైవేట్ బస్సులను తనిఖీలు నిర్వహించి టికెట్లతోపాటు, కండక్టర్, డ్రైవర్ల పనితీరును పరిశీలించారు. పలువురు డ్రైవర్, కండక్టర్లకు సూచనలతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి జనగామకు వస్తున్న బస్సుల్లో ఓ కండక్టర్ ప్రయాణికుల వద్ద నుంచి అధికంగా డబ్బులు వసులు చేశారని డీఎంకు ప్రయాణీకులు ఫిర్యాదు చేయగా వెంటనే ఆ కండక్టర్‌ను హెచ్చరించారు. అలాగే ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న వారి డ్రైవింగ్‌ను పరిశీలించి డ్రైవింగ్ విధానం సక్రమంగా లేని 10 మంది దరఖాస్తులను రిజెక్ట్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా పలు డిపోలకు చెందిన బస్సులతో పాటు జనగామ డిపోకు చెందిన రాత్రిపుట నడిచే బస్సు డ్రైవర్లకు, మెడికల్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించి బస్సులను అందిస్తున్నారు.

కాగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ వినయ్‌కృష్టారెడ్డి బస్సుల రవాణాతో పాటు సిబ్బంది నియమాకంపై ఎప్పటికప్పుడు డిపో డీఎంతో చర్చించి అవసరమైన సిబ్బందిని సమకూర్చుతున్నారు. ఈమేరకు డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ జనగామ ఆర్డీవో మధుమోహన్ ఆదివారం బస్టాండ్, డిపోను సందర్శించారు. బస్టాండ్‌లో ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉన్నందున ముందుస్తు చర్యగా అగ్నిమాపకశాఖతో పాటు పోలీస్ బందోబస్తును పరిశీలించారు. అదేవిధంగా జనగామ డిపో, బస్టాండ్ ప్రాంతాల్లో మరో 8 అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి 24 గంటల పాటు సీసీ కెమెరాల నిఘాను పరిశీలించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు.

కాగా తాత్కలిక కండక్టర్ డ్రైవర్ పోస్టులకు గ్రామీణ ప్రాంతాల నుంచి 200 మందికిపైగా డిపో వద్దకు వచ్చి క్యూలో నిలుచోని దరఖాస్తులు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికులు వారి సమస్యలను పరిష్కరించివారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక దీక్షలో ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌రెడ్డి మృతికి సంతాపంగా జనగామ ఆర్టీసీ కార్మికులు పట్టణంలోని ప్రధాన కూడలిలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. కాగా బస్టాండ్, డిపోలో బందోబస్తులో జనగామ సీఐ మల్లేశ్‌యాదవ్, ఎస్సైలు రవికుమార్, రాజేశ్‌నాయక్, ఎంవీఐ సాయిచరణ్, ఆర్టీఏ కానిస్టేబుల్ వెంకటేశ్, సిబ్బంది సారంగపాణి తదితరులు ఉన్నారు.

శనివారం డిపో ఆదాయం రూ.4,99,582
శనివారం జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు 23,580 కిలోమీటర్లు తిరగగా రూ.4,99,582 ఆదాయం సమకూరిం ది. ఇందులో డ్రైవర్, కండక్టర్‌తో పాటు డిపో నిర్వహణ సిబ్బందికి రూ.2,33,425 నగదును అందించారు. రూ.2,66,157 లక్షలను బ్యాంక్‌లో జమచేసినట్లు జనగామ డిపో మేనేజర్ తెలిపారు.

61

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles