డయాలసిస్ సేవలు బాగున్నాయి..


Mon,October 14, 2019 03:54 AM

జనగామ టౌన్ : , జనగామ జిల్లా ప్రధాన దవాఖానలో డయాలసిస్ సేవలు చాలా బాగున్నాయని రాష్ట్రప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. ఆదివారం జనగామ జిల్లా ప్రధాన దవాఖానలోని డయాలసిస్ యూనిట్ కేంద్రాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వ విప్ జనగామకు వచ్చారు. ఈమేరకు దవాఖానలోని డయలసిస్ సెంటర్‌ను పరిశీలించి, సెంటర్‌లో ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, నిర్వహణ వివరాలను సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారని అన్నారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలు వంటివి వస్తే ఎన్నో ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు అటువంటి సమస్యలు లేకుండా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందుతున్నాయన్నారు.


ఇందులో భాగంగానే రాష్ట్రప్రభుత్వ ఏర్పాటు అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటుచేశారని, దీంతో డయాలసిస్ బాధితులకు సైతం ఎంతో మేలు చేకూరిందన్నారు. తన నియోజకవర్గంలోని ఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు జనగామ సెంటర్‌ను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆలేరులోని సీహెచ్‌సీకి వెంటనే డయాలసిస్ యూనిట్‌ను ఇప్పించాలని సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి ఇటల రాజేందర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో జనగామ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ అశోక్‌కుమార్, జిల్లా దవాఖాన ఆర్థో డాక్టర్ బాలాజి, డయాలసిస్ యూనిట్ ఇన్‌చార్జిలు ఉన్నారు.

50

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles