-వాల్మీకి జయంతిలో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
జనగామ, నమస్తే తెలంగాణ : బోయ కులస్తులకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు అన్ని రంగాల్లో వారికి ప్రాధాన్యత కల్పిస్తామని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బోయ కులస్తులు కమ్యూనిటీహాల్ నిర్మాణానికి నిధులు సమకూర్చుకుంటే అందుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తానని పేర్కొన్నారు. అనంతరం వాల్మీకి చిత్రపటానికి ఆర్డీవో మధుమోహన్, జనగామ ఎంపీపీ మేకల కళింగరాజు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎండీ గౌస్‌పాషా, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే వెంకటేశ్వర్లు, వాల్మీకి బోయ సంఘం జిల్లా అధ్యక్షుడు కెంగర్ల రాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆర్టీవో మాట్లాడుతూ వాల్మీకి బోయ కులంలో సాధారణ వ్యక్తిగా జన్మించి మహర్షిగా మారి ఆదర్శ జీవితం గడిపిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన జీవితం భావి తరాలకు స్ఫూర్తిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బోయ సంఘం నాయకులు గొడుగు కిషన్, కెంగర్ల రవి, బీసీ సంఘాల నాయకులు వెలిశాల అశోక్, కాసుల శ్రీనివాస్, వసతి గృహాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.