జోరుగా మద్యం షాపులకు దరఖాస్తులు


Sun,October 13, 2019 01:42 AM

జనగామ టౌన్‌, అక్టోబర్‌ 12: ఎక్సైజ్‌ నూతన పాలసీ ప్రకారం దరఖాస్తుల స్వీకరణలో భాగంగా 4వ రోజు(శనివారం) జిల్లా వ్యాప్తంగా 41 వైన్స్‌ దుకాణా ల నుంచి 69 టెండర్లు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్‌ అధికారి ఆర్‌ మహిపాల్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు జిల్లాలోని 41 వైన్స్‌లకు మొత్తంగా 132 దరఖాస్తులు దాఖలైనట్లు తెలిపారు. ఇందులో ప్రధానంగా జనగామ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో 51 దరఖాస్తులు నమోదు కాగా స్టేషన్‌ఘపపూర్‌ నుంచి 48, పాలకుర్తి నుంచి 33 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఇంకా ఆసక్తి గల వ్యాపారులు ఈనెల 16న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నె 18న డ్రా తీయనున్నట్లు వివరించారు. కాగా శనివారం వివిధ మండలాల నుంచి వచ్చిన వారితో ఎక్సైజ్‌ అధికారి కార్యాలయంలో టెండర్‌దారులు క్యూలు కట్టి మరీ టెండర్‌ పత్రాలను అధికారులకు అందించినట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం సందర్భంగా దరఖాస్తుల స్వీకరణ ఉండదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎక్సైజ్‌ సీఐ నాగేశ్వర్‌రావు, ఎస్సై సుధీర్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ సీఐ ముకుందరెడ్డి, పాలకుర్తి సీఐ బ్రహ్మానందరెడ్డితో పాటు వివిధ స్టేషన్ల ఎస్సైలు భాస్కర్‌రెడ్డి, శరత్‌కుమార్‌, అంజయ్య, సరితతో పాటు జిల్లా కార్యాలయ సిబ్బంది సుభాశ్‌, సందీప్‌ ఉన్నారు.

52

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles