సేవలు యథాతథం


Sat,October 12, 2019 03:35 AM

-ప్రయాణికులతో కిక్కిరిసిన జనగామ బస్టాండ్
-96 బస్సులు నడిపించిన అధికారులు
-ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
-అదనపు చార్జీల వసూలు డ్రైవర్, కండక్టర్‌కు కౌన్సెలింగ్
-బస్సుల్లో టికెట్ ధరల స్టిక్కర్ల ఏర్పాటు


మహబూబాబాద్,నమస్తే తెలంగాణ : ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో మహబూబాబాద్, తొర్రూర్ డిపోల పరిధిల్లో ప్రయాణికులకు ఏలాంటి ఇబ్బందులు కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టింది. అధికారులు, పోలీస్ సిబ్బంది సహకారంతో రెండు డిపోల పరిధిల్లో ఆర్టీసీ బస్సులను ప్రైవేటు డ్రైవర్లను నియమించి నడుపుతున్నారు. ఈ రెండు డిపోల నుంచి ఆర్టీసీకి చెందిన 93 బస్సులు, ప్రైవేట్ బస్సులు 34 నడిపించారు. ఇందులో మహబూబాబాద్ డిపోకు సంబంధించినవి 47 ఆర్టీసీ, 13 ప్రైవేట్ బస్సులు, తొర్రూరు డిపోకు చెందిన 46 ఆర్టీసీ, 21 ప్రైవేట్ బస్సులను పోలీసుల సహకారంతో నడిచాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పలురాజకీయ పార్టీల మద్దతు పలికారు. ఏడో రోజుకూడా ఆర్టీసీ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. కాగా మహబూబాబాద్ డిపోకు సంబంధించిన ఆగివున్న ఒక ప్రైవేట్ బస్సు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టినట్లు తెలిసింది.

కొనసాగుతున్న బస్ సర్వీసులు
తొర్రూరు, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి బస్సులను నడిపించారు. శుక్రవారం తొర్రూరు డిపో నుంచి 67 బస్సు సర్వీస్‌లను నడిపినట్లు డీఎం సారయ్య తెలిపారు. వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నర్సంపేట, మహబూబాబాద్, హైదరాబాద్ తదితర రూట్లలో 46 ఆర్టీసీ, 21 ప్రైవేట్ బస్సుల ద్వారా ప్రయాణికులను గమ్యానికి చేర్చినట్లు పేర్కొన్నారు.

58

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles