ఐదురోజులు.. రూ.9 లక్షలు


Thu,October 10, 2019 04:12 AM

జనగామ టౌన్: రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొని ఐదు రోజులు పూర్తయినా సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో డీటీవో రమేశ్‌రాథోడ్, జనగా డిపో మేనేజర్ భూక్య ధరంసింగ్, డీసీపీ శ్రీనివాసరెడ్డి అధికారులు సమన్వయంతో ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేసి జిల్లా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్నిరకాల రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. జనగామ డిపో పరిధిలో 100 ఆర్టీసీ బస్సులు ఉండగా అందులో సుమారు 80 బస్సుల వరకు ప్రయాణికుల రాకపోకలకు వినియోగించారు. డిపోలోని 25 అద్దె బస్సులుండగా 20 బస్సులు, ప్రైవేట్ స్కూల్, కళాశాలలకు చెందిన 12 బస్సులను రవాణాకు యథావిధిగా వినియోగిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం 81శాతం వరకు బస్సుల సేవలను వినియోగించినట్లు వారు పేర్కొన్నారు.


ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ముందుకు..
ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చి బుధవారం నాటికి ఐదు రోజులు గడిచినా కార్మికులు సమ్మె విరమించకపోవడంతో జిల్లా అధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించి ఆర్టీసీ చక్రం ఆగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఐదురోజుల్లో డిపోకు అవసరమ్యే మెకానిక్ మొదలు, వాషింగ్ బాయ్స్ వరకు సరిపడా తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసుకోగా రూ.9 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకున్న సిబ్బందికి రూ.7.5 లక్షలను వేతనాల రూపంలో అందించామని, కాగా బుధవారం డిపో నుంచి 78 ఆర్టీసీ, 18 అద్దె, 12 ప్రైవేట్ సంస్థల బస్సులు పండుగ రిటర్న్ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొ చ్చినట్లు డీఎం ధరంసింగ్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ ప్రయాణికుల సౌకర్యాల దృష్ట్యా షిఫ్టుల వారీగా జిల్లాలోని పలువురు తహసీల్దార్లకు ఉదయం ఒకరికి, రాత్రి సమయంలో మరొకరికి విధులను కేటాయిస్తూ డిపోకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుతున్నారు.

ఈ మేరకు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఏసీపీ, సీఐ, ముగ్గురు ఎస్సైలతో పాటు ప్రత్యేక పోలీస్ బృందాలతో భారీ బందోబస్తు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘన చేసినవారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందులో తరిగొప్పుల తహసీల్దార్ స్వప్న, జనగామ తహసీల్దార్ రవీందర్, జనగామ ఏసీపీ వినోద్‌కుమార్, సీఐ మల్లేశ్ యాదవ్, ఎస్సైలు సీహెచ్ రవికుమార్, రాజేశ్‌నాయక్, శ్రీనివాస్ ఉన్నారు. కాగా బచ్చన్నపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ఆర్టీసీ కార్మికులు మానవహారం నిర్వహించారు. ముందుగా అమవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు.

52

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles