సమష్టి కృషితోనే గ్రామాల అభివృద్ధి


Wed,September 18, 2019 02:37 AM

జఫర్‌ఘడ్/రఘునాథపల్లి, సెప్టెంబర్ 17: ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సమష్టి కృషితోనే గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయని జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి అన్నారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై జఫర్‌ఘడ్, రఘునాథపల్లి మండల పరిషత్ కార్యాలయాల్లో మంగళవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ముఖ్య అతిథిగా సంపత్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ పల్లెల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీలకు నిర్ధిష్టమైన చట్టాలు రూపొందించినట్లు వివరించారు. గ్రామ పంచాయతీలకు స్వయం పరిపాలనా విధానాన్ని అమలు చేయడంతో వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామాల అభివృద్ధికి దాతలు విరాళాలు అందించి, జన్మనిచ్చిన ఊరి రుణం తీర్చుకోవాలని కోరారు. గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం, విద్యుత్ అంశాలపై ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలని సంపత్‌రెడ్డి సూచించారు. పరిసరాల్లో నిల్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ ఇంటి ఆవరణలో ఏడేసి మొక్కలు నాటి కాపాడాలన్నారు. అనంతరం జెడ్పీ చైర్మన్‌గా మొదటిసారిగా జఫర్‌ఘడ్‌కు విచ్చేసిన సంపత్‌రెడ్డిని శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ రడపాక సుదర్శన్, జెడ్పీటీసీ ఇల్లందుల బేబీ, ఎంపీడీవో శ్రీధర్‌స్వామి, తహసీల్దార్ వీరప్రకాశ్, గ్రామాల ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


పల్లెల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం
పల్లెలు బాగుపడితేనే నిజమైన అభివృద్ధి జరిగినట్లని సీఎం కేసీఆర్ భావించి, ఆ దిశగా చర్యలు చేపట్టారని జెడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డి అన్నారు. రఘునాథపల్లి ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమీక్షలో మాట్లాడారు. 30 రోజుల ప్రణాళికలో గ్రామస్తులను భాగస్వామ్యం చేయాలన్నారు. వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ మేలక వరలక్ష్మి, జెడ్పీటీసీ బొల్లం అజయ్, ఎంపీడీవో వసుమతి, వైస్ ఎంపీపీ రంగమ్మ, అధికారులు పాల్గొన్నారు.

53

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles