పల్లెలు మురిసేలా ప్రగతి సాధించాలి


Wed,September 18, 2019 02:37 AM

స్టేషన్‌ఘన్‌ఫూర్ నమస్తేతెలంగాణ: పల్లెలు మురిసేలా ప్రగతి సాధించాలని డీపీవో వెంకటేశ్వర్‌రావు పిలుపునిచ్చారు. మండలంలోని ఇప్పగూడెంలో 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన శ్రమదాన కార్యక్రమాల్లో డీపీవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఎంపీడీవోతో కలిసి రోడ్లకు ఇరువైపులా పిచ్చిమొక్కలను తొలగించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఈవోను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ వందశాతం ఓడీఎఫ్ సాధించేందుకు గ్రామాల్లో పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు నిర్మించుకునేలా అధికారులు కృషి చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఇంటి ఆవరణలో ఆరు మొక్కలు నాటి సంరక్షించుకోవాలని సూచించారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు, బ్యాగులను వాడొద్దన్నారు. గోనె సంచులను ఉపయోగించాలని సూచించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతీ ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలన్నారు. ఈ 30 రోజుల ప్రణాళికలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు బాధ్యతాయుతంగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో కుమారస్వామి, ఈవోపీఆర్డీ మహబూబ్ అలీ, ఈవో మోహన్, స్పెషల్ ఆఫీసర్ వినయ్‌కుమార్, సర్పంచ్ అజయ్‌రెడ్డి, ఉపసర్పంచ్ జక్కుల పరశురాములు, ఫీల్డ్ అసిస్టెంట్ కవిత, కో ఆప్షన్ మెంబర్ గట్ల మల్లారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వార్డు సభ్యులు దామెర రాజు, దైదా లెనిన్, వారాల రాజు, సంధ్య, మర్రి తిరుమల పాల్గొన్నారు.


పల్లెలు ప్రగతి సాధించాలి
జనగామ రూరల్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికతో పల్లెలు ప్రగతి సాధించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని పెంబర్తిలో శ్రమదానం చేశారు. పిచ్చిమొక్కలు, శిథిలావస్థలో ఉన్న పలు ఇళ్లను తొలగించడానికి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతబోరు బావులను పూడ్చివేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నిమ్మతి దీపిక, ఎంపీడీవో ఎండీ హసీం, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఆంజనేయులు, స్వప్నరాజు, రవి, రవికుమార్, శారద, ఎంపీవో సంపత్, ఉప సర్పంచ్‌లు రేఖరాజు, అనిల్, అధికారులు, కార్యదర్శులు, కో ఆప్షన్ సభ్యులు, మహిళ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

బొమ్మకూర్ అభివృద్ధికి ఎన్నారై విరాళం
గ్రామాభివృద్ధికి రూ. 25,116 అందించిన బానోత్ క్రాంతికుమార్ నాయక్
నర్మెట: తాను పుట్టిన ఊరి రుణం తీర్చుకునేందుకు ఓ ఎన్నారై ముందుకొచ్చారు. ఈ మేరకు బొమ్మకూర్ అభివృద్ధికి రూ. 25,116 చెక్కును మంగళవారం సర్పంచ్ బానోత్ శంకర్‌నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అమెరికాలో ఉద్యోగం చేస్తున్న బానోత్ క్రాంతికుమార్‌నాయక్ గ్రామాభివృద్ధికి విరాళం అందించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో చేపట్టిన 30 రోజుల కార్యాచరణతో పల్లెలకు కొత్త వెలుగులు వస్తున్నాయన్నారు. క్రాంతికుమార్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని తమకు తోచిన సాయం అందించి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రత్యేకాధికారి పర్యవేక్షణలో గ్రామ పంచాయతీ పాలకవర్గం, కో ఆప్షన్ సభ్యులు హరితహారం, పారిశుధ్యం, వీధిదీపాలు పనుల కమిటీల సభ్యులు ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రత్యేకాధికారి బానోత్ భగవాన్‌నాయక్, టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు పండుగ రమేశ్, టీఆర్‌ఎస్ మండల కోశాధికారి పోలెపాక తిరుపతి, కార్యదర్శి లింగయ్య, వార్డు సభ్యుడు మల్లయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ పర్శరాములు, వీఆర్‌ఏ మంజుల, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

49

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles