గుత్తాకు మంత్రి ఎర్రబెల్లి అభినందనలు


Sun,September 15, 2019 03:04 AM

పాలకుర్తి రూరల్ : శాసనమండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనా గుత్తా సుఖేందర్‌రెడ్డిని రాష్ట్రపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాలశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాసంలో హోంమత్రి హహమూద్ అలీ, మండలి చీఫ్ విప్ బొడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, కర్నె ప్రభాకర్, నవీన్‌రావుతో కలిసి సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. మండలి చైర్మన్‌గా సభా గౌరవాన్ని కాపాడుతారని ఈసందర్భంగా వారు విశ్వాసం వ్యక్తంచేశారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి మండలి చైర్మన్‌గా ఎన్నికకావడం ఆనందదాయకమన్నారు.

50

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles