స్వచ్ఛతతోనే గ్రామాల అభివృద్ధి


Sun,September 15, 2019 03:04 AM

నర్మెట/తరిగొప్పుల, సెప్టెంబర్14: పరిసరాల పరిశుభ్రతలో ప్రజలు భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన గ్రామాల అభివృద్ధి కోసం 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మంకెన ఆగిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సంపత్‌రెడ్డి మాట్లాడారు. ప్రతీ కుటుంబానికి తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఆలోచన ఉంటే నిరంతరంగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. కార్యదర్శులు, సర్పంచ్‌లు చైతన్యవంతంగా ఉన్న గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక సక్రమంగా సాగేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాలను పచ్చధనంతో తీర్చిద్దిదుకునేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషి, అంకితభావంతో పని చేయాలన్నారు. అధికారులతో పాటు సిబ్బంది సమిష్టిగా పనులు చేపట్టి ప్రగతి పథంలో నడిచేలా చూడాలని ఆయన కోరారు. గ్రామాల్లో డంపింగ్ యార్డు, హరితహారం, రోడ్లకిరువైపుల ఉన్న పిచ్చి మొక్కలు, ప్రతీ గ్రామాల్లో పనులు ముమ్మరంగా కొనసాగించాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న పాత బావులను పూడ్చివేయాలని, ఆదేవిధంగా శిథిలావస్థలో ఉన్న ఉన్న ఇండ్లను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. స్థలం లేని గ్రామాల్లో గ్రామసభలను ఏర్పాటు చేసి గ్రామస్తుల సమక్షంలో స్థలదాతలను చూసుకోవాలన్నారు. ప్రతీ ఇంటికీ ఆరు మొక్కలను తప్పనిసరిగా అందించాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా ప్రతీ గ్రామంలో స్వచ్ఛత గ్రామాలుగా తీర్చిదిద్దుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.


తిరిగి వారం రోజుల్లోగా సమీక్ష సమావేశం నిర్వహించే వరకు గ్రామాల్లో సమస్యలు ఉండవద్దన్నారు. హరితహారం, 30రోజుల ప్రణాళికలో ప్రతీ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, పీల్డ్ అసిస్టెంట్లు వీధులల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదర్శ మండలాలుగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతీఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నర్మెటకు తొలిసారిగా వచ్చిన సందర్భంగా జెడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డికి శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ మాలోత్ శ్రీనివాస్ నాయక్, వైస్ ఎంపీపీ మంకెన ఆగిరెడ్డి, ఎంపీడీవో కృష్ణయ్య, ఎంపీటీసీలు కల్యాణం మురళీ, చైతన్య, తరిగొప్పుల వైస్ ఎంపీపీ చెన్నూరి ప్రమీల, మండల ప్రత్యేక అధికారి శ్రీపాల్, ఎంపీడీవో కృపాకర్, జెడ్పీటీసీ సభ్యురాలు ముద్దసాని పద్మజారెడ్డి, ఎంపీటీసీలు అర్జుల మధుసూదన్‌రెడ్డి, భిక్షపతి, సర్పంచులు ప్రభుదాస్, ముక్కెర బుచ్చిరాజు, నంద్యానాయక్, కార్యదర్శులు రామరావు, మమత, రవీందర్, వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రత్యేకాధికారులు, వివిధ శాఖల అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

50

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles