రోడ్డపై చెత్త వేసిన వ్యక్తులపై చర్యలు


Sun,September 15, 2019 03:03 AM

దేవరుప్పుల, సెప్టెంబర్ 14 : దేవరుప్పుల గ్రామపంచాయతీ పారిశుధ్య కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఓ వైపు వీధులను శుభ్రం చేస్తుండగా మరోవైపు చెత్తను విచక్షణారహింతగా వీధుల్లో పారేస్తున్న ఇంటి యజమానులకు జరిమానా విధించి హెచ్చరికలు జారీ చేసింది. గ్రామంలో శనివారం బస్టాండ్ ప్రాంతంలోని చందన బేకరి యజమాని బేకరీలో ఉన్న చెత్తను బస్తాలో వేసి దేవరుప్పుల పీఆర్ రోడ్డుపై వేయగా చెల్లా చెదరుగా పడింది. మరోవైపు కొబ్బరి బోండాల దుకాణం యజమాని ధనమ్మ ఖాళీ బొండాలని మరో ఇంటి వద్ద వేస్తుండగా దుర్గంధం వ్యాపించింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సర్పంచ్ ఈదునూరి రమాదేవి వారికి జరిమానా విధించింది.


ఎంపీడీవో రాధాకృష్ణకుమారి, గ్రామప్రత్యేకాధికారి అనూష వెంట రాగా చందన బేకరి యజమానికి హెచ్చరికలు జారీ చేయడమేకాక వెంటనే రూ.2 వేల జరిమానా విధించి వసూలు చేశారు. ఇక బస్టాండ్ వద్ద వద్ద బొండాల వ్యాపారం చేసే ధనమ్మ నుంచి రూ.500 జరిమానా వసూలు చేశారు. మరోవైపు చికెన్ షాపు యజమానులు మాంసం వ్యర్థాలను విచ్ఛలవిడిగా గ్రామసమీపంలో పడేస్తున్నారని ఫిర్యాదులు అందాయని, త్వరలో వారిపై చర్యలు ఉంటాయని సర్పంచ్ రమాదేవి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తోటకూరి దశరథ, పంచాయతీ కార్యదర్శి లుక్మన్, కారోబార్ వెంకట్‌రెడ్డి, కిస్టయ్య, యాదగిరి, పెద్దాపురం పాల్గొన్నారు.

46

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles