హైనా దాడిలో దూడ మృతి

Sat,September 14, 2019 01:40 AM

స్టేషన్‌ఘన్‌పూర్ నమస్తేతెలంగాణ, సెప్టెంబర్13: స్టేషన్‌ఘన్‌పూర్ మండలం పాంనూర్ గ్రామంలో శుక్రవారం హైనా దాడిలో దూడ మృతి చెందినట్లు స్టేషన్‌ఘన్‌పూర్ ఫారెస్టు ఆఫీసర్ కొండల్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. పాంనూర్ గ్రామానికి చెందిన రైతు పాలేటి వెంకటయ్య తనకు ఉన్న తన వ్యవసాయబావి వద్ద శుక్రవారం రాత్రి పశువులను కట్టేసి ఇంటికి వెళ్లాడని చెప్పారు. శనివారం తెల్లవారు జామున ఉదయం దూడ హైనా దాడిలో మరనించినట్లు గుర్తించాడని వివరించారు. విషయం తెలుసుకున్న ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ అరుణ ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. స్థానిక పశువైద్యుడి పోస్టుమార్టం అనంతరం చనిపోయిన దూడకు సంబంధించిన నష్టపరిహారం బాధితుడికి చెల్లించనున్నట్లు కొండల్‌రెడ్డి వెల్లడించారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles