విష్ణుపురిలో ఇంటిపై దాడి..

Sat,September 14, 2019 01:40 AM

కాజీపేట, సెప్టెంబర్13: కాజీపేటకు చెందిన ఓ మహిళా గ్యాంగ్.. ఇంటిపై దాడికి దిగి హల్‌చల్ చేసిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మహిళా గ్యాంగ్ దాడి ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విష్ణుపురికి చెందిన మౌనిక, స్రవంతి, తులసీ, దివ్య, షాలినీ, సోని, కోమల్, రాజేశ్వరీ గ్రూప్‌గా ఏర్పడి డోమోక్స్ కంపెనీలో అంగన్ వాడీ ఆయా గీత నేతృత్వంలో పని చేస్తున్నారు. సదురు కంపెనీ వారు జీతం ఇవ్వకపోవడంతో ఇటీవల వీరంతా డోమోక్స్ కంపెనీ నుంచి తప్పుకుని బ్రూ కంపెనీలో పని చేస్తున్నారు. దీంతో అంగన్‌వాడీ ఆయా ఓ మహిళా గ్యాంగ్‌ను తీసుకొచ్చి చిన్నాపెద్ద అనే తేడా లేకుండా విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. దీంతో పాటు సెల్ ఫోన్, రూ. 4వేలు, అర్ధ తులం కమ్మలను బలవంతంగా గుంజుకొని వెళ్లారని బాధితులు తెలిపారు. తమపై అకారణంగా దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాధితులు పోలీసులను కోరారు. అయితే ఈ విషయమై విచారణ జరిపి మహిళా గ్యాంగ్‌పై కేసులు నమోదు చేస్తామని సీఐ అజయ్ తెలిపారు.

23
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles