పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్

Sat,September 14, 2019 01:39 AM

జనగామ టౌన్: ప్రతీ ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో దోమల నివారణకు కలెక్టర్ ప్రత్యేక చర్యలను చేపట్టారు. ఈ మేరకు డీఎంహెచ్‌వో మహేందర్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా కేం ద్రంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఫాగింగ్ పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్, డీఎంహెచ్‌వో మాట్లాడు తూ.. జిల్లాలో సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి తీవ్రతలు పెరుగకముందే ప్రభుత్వ దవాఖానల్లో వైద్యచికిత్సలు చేయించుకోవాలన్నారు. అలాగే, మన ఇంటి చుట్టు కాలనీల్లో నీటి నిల్వలు, చెత్తచేదారం లేకుండా చూసుకోవాలన్నారు.

ఆదేవిధంగా ప్రస్తుతం ఉన్న రెండు ఫాగింగ్ పరికరాలు కాకుండా మరో 7ఫాగింగ్ పరికరాలను కొనుగోలు చేసేందుకు అర్డర్ చేయాలని డీపీవో వెంకటేశ్వర్లును కలెక్టర్ ఆదేశించారు. కాగా, ఈ పరికరాలతో ప్రతీరోజు సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 8గంటల వరకు గ్రామలతో పాటు మున్సిపాలిటీల్లో ఫాగింగ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన దవాఖాన పర్యవేక్షకులు డాక్టర్ పూజారి రఘు, సీహెచ్‌వో జైపాల్‌రెడ్డి, డాక్టర్ పూర్ణచందర్, మాస్ మీడియా ప్రతినిధి ప్రభాకర్, ఎస్‌యూవో రవీందర్, సంపత్, ఎంపీహెచ్‌ఎస్ రవి, ఫాగింగ్ ఆపరేటర్ సాంబయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles