శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు

Sat,September 14, 2019 01:38 AM

బచ్చన్నపేటలో కార్డన్‌సెర్చ్ .. పాల్గొన్న డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి
బచ్చన్నపేట: శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని జనగామ డీసీపీ శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజయ్యనగర్‌లో ప్రతీ ఇంటిని సోదా చేశారు. వాహనాలకు అన్ని పత్రాలు ఉన్నాయా లేదా పరిశీలించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ.. రోజురోజుకు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి జీవితాలను బుగ్గిపాలు చేసుకోవద్దని సూచించారు. వాహన దారులు విధిగా హెల్మెట్ ధరించాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు కన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇంటి నుంచి ఊరికి వెళ్లేవారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు. ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాల పనితీరుపై పర్యవేక్షణలు జరుపాలన్నారు. ప్రతీ వాహనానికి అన్ని పత్రాలు ఉండాలన్నారు. లైసెన్స్ లేని పక్షంలో వాహానాన్ని సీజ్ చేస్తామన్నారు. సమస్యలతో స్టేషన్‌కు వచ్చేవారికి మర్యాదపూర్వకంగా సమాధానాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, ఉప సర్పంచ్ హరిక్రిష్ణ, జనగామ ఏసీపీ వినోద్‌కుమార్, నర్మెట సీఐ సంతోష్‌కుమార్, ఎస్సైలు రంజిత్‌రావు, పరమేశ్వర్, రాజేశ్‌నాయక్, ట్రైనీ ఎస్సైలు ప్రశాంత్, కిశోర్, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles