రెండో రోజూ నిమజ్జనం


Fri,September 13, 2019 03:51 AM

జనగామ టౌన్, సెప్టెంబర్ 12 : తొమ్మిది రోజులు విశేషపూజలందుకున్న గణనాథులు గురువారం శోభాయాత్రలతో ఉరేగింపులుగా గంగమ్మ చెంత కు చేరుకున్నారు. గణనాథుడి నామస్మరణలతో భక్తులు తేలియాడారు. డప్పుచప్పుళ్లు, విన్యాసాలు, కోలాటాలు, భజనలు, మేళతాళాలు, హహిళలు దిపారా ధానలతో ఉత్సవగణపతులను పురవీధుల్లో ఆనందోత్సవాలతో ఊరేగించారు.ఆహ్లాదకర మైన వాతావరణంలో జరిగిన ఈశోభాయాత్రలో భక్తజన జాతరగా కొనసాగింది. జిల్లా కేంద్రంలోని జయశంకర్‌నగర్, జ్యోతీనగర్, బాలాజీనగర్ వెంకన్నకుంట, వాసవిస్ట్రీట్, రెడ్డిస్ట్రీట్, పాతబీట్ బజార్, రైల్వేస్టేషన్ రోడ్డు గణపతి నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు..ఈసందర్భంగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధ్దలతో, ఆటాపాటలతో శోభాయ మానంగా అలంకరించిన వివిధ వాహనాలల్లో గణనాథులను పట్టణంలోని పురవీధులగుండాఊరేగించి నెల్లుట్ల చెరువులో నిమజ్ఞనంచేశారు.కాగా జిల్లా కేంద్రంలో చిన్న గణపతి నుంచిపెద్ద గణపతులు మొత్తంగా 300 వరకు ఉండగా బుధవారం రాత్రి వరకు ప్రజల సహాకరంతో 195 గణపతులు నిమజ్జం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పురప్రముఖలు, స్థానిక ప్రజలు, వివిధశాఖల అధికారులు ఉన్నారు. కాగా జనగామలోని బాలాజీనగర్ వినాయకుడి శోభాయాత్ర నిర్వహించగా, అంతకుముందు నిర్వహించిన స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని రూ.10,116కు భాస్కర్ అనే వ్యక్తి వేలంలో దక్కించుకున్నాడు.


వల్మిడిలో ఘనంగా గణేశ్ శోభయాత్ర
పాలకుర్తి : వల్మిడి గ్రామంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి వైభవంగా శోభయాత్ర నిర్వహించారు. యువకులు సంప్రదాయ దుస్తులు ధరించి కోలాటం, నృత్యాలు, మేళతాళాల నడుమ స్వామివారి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు యువకులు ప్రజలు ప్రజాప్రతినిథులు పాల్గొన్నారు.

శివునిపల్లిలో రూ.1.5లక్షలు పలికిన లడ్డూ
స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్: మండల కేంద్రంలోని శివునిపల్లి శ్రీలలితాంబిక దేవాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని గురువారం నెమిలిగొండ గ్రామానికి చెందిన దేవాలయ కమిటీ సభ్యుడు, దేవి ఉపాసకులు నిమ్మ దివిజేందర్‌రెడ్డి వేలంలో రూ.లక్షా ఐదువేలకు పాడి దక్కించుకున్నాడు. కార్యక్రమంలో వినాయక నిమజ్జన కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాపర్తి సుధాకర్, శ్రీలలితాంబిక దేవాలయం కమిటీ సభ్యులు లింగాల కుమారస్వామి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక నిమజ్జం చేశారు. కాగా శివునిపల్లిలో లడ్డూ ఇంతధర పలకడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

62

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles