తండాలు అభివృద్ధిలో మార్గదర్శకం కావాలి


Thu,September 12, 2019 02:33 AM

కొడకండ్ల, సెప్టెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చెంది తండాలు ఇతర గ్రామాలకు మార్గదర్శకం కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం ఆయన మండలంలోని గిర్నితండాలో జరుగుతున్న అభివృద్ధి కార్యాక్రమాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తండావాసులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ గత పాలకుల హయాంలో గిరిజన తండాలను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. జీపీలుగా మారడం గిరిజనుల చిరకాల వాంఛ అయినా ఉమ్మడి రాష్ట్రంలో పక్కనబెట్టారన్నారు. స్వరాష్ట్రంలో తండాలను, ఆవాస ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తేనే బాగుపడుతాయనే ఉద్దేశంతో జీపీలుగా ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. సీఎం లక్ష్యాన్ని నెరవేర్చాలంటే, ప్రతీ తండావాసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.


స్వయంగా డోజర్ నడిపి..
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి స్వయంగా డోజర్ నడిపి పిచ్చిమొక్కలు, రోడ్డుపైన ఉన్న మట్టిని తొలగించారు. యువకులతో కలిసి శ్రమదానంతో పిచ్చిమొక్కలను తొలగించారు. 30 రోజుల ప్రణాళికలో యువత, గ్రామ పెద్దలు, ఎన్నారైలు, స్థానిక ప్రజాప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొని గ్రామాల అభివృద్ధికి విరాళాలు అందజేయాలని ఆయన కోరారు. దాతలను ప్రభుత్వం ప్రత్యకంగా గౌరవిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర జీసీసీ చైర్మన్ ధరావత్ మోహన్ గాంధీనాయక్, ఎంపీపీ జ్యోతి రవీంద్రనాయక్, గిర్నితండా సర్పంచ్ ధరావత్ రాజ్‌కుమార్‌నాయక్, మైదంచెరువుతండా సర్పంచ్ మహేశ్‌నాయక్, వెంకన్న నాయక్, శారదనాయక్, సురేశ్‌నాయక్, వినోదకిషన్ నాయక్, నరేశ్,రవి, సోమాని, దేవేందర్, నెహ్రూ, జీపీ కార్యదర్శి రేణుక, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.

57

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles