గ్రామాల్లో మార్పు కనిపించాలి


Tue,September 10, 2019 02:23 AM

-గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలక పాత్ర
-సీఎం కేసీఆర్ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగాలి
-30 రోజుల ప్రణాళిక పక్కాగా అమలుచేయాలి
-నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
-అధికారులకు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి సూచన
-రాఘవపూర్ గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్


స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ : ముప్పై రోజుల ప్రణాళికను సద్వినియోగం చేసుకొని గ్రామాల్లో మార్పు సాధించుకోవాలని జనగామ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని రాఘవపూర్ గ్రామాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా అక్కడక్కక పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని ఆదేశించారు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం ఏలా అమలువుతుందని అడిగితెలుసుకున్నారు. ప్రణాళికలో భాగంగా ఖాళీ స్థలాల్లో చెట్లు పొదలు ఉంటే రెండు రోజుల్లో శ్రమదానం చేయించి తొలగించాలన్నారు. ఈసందర్భంగా ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు అందజేయాలని ఈజీఎస్ సిబ్బందికి ఆదేశించారు. దీంతో దోమలను అరికట్టే తులసి, కృష్ణ తులసి మొక్కలు ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. డంపింగ్‌యార్డును తప్పకుండా వినియోగించుకోవాలన్నారు.

గ్రామంలో 30 రోజుల ప్రణాళిక పూర్తయి తర్వాత నిధులు రావని భయపడొద్దని, 14 ఫైనాన్స్ కింద నిధులు వస్తాయని సర్పంచ్, గ్రామస్తులకు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలంతా కలిసి సమస్వయంతో పనిచేస్తేనే నిర్ధేశించుకున్న లక్ష్యం సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం గ్రామంలో ఎలక్ట్రికల్‌కు సంబంధించిన పనుల పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్పంచ్‌కు పలు విశిష్ట అధికారులు, విలువలు కల్పించబడ్దాయని, కావున గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని తెలిపారు. మన పల్లెలను మనమే ఆదర్శంగా తీర్చిదిద్దుకునే అవకాశం వచ్చిందని, దానిని గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

గ్రామసమస్యల పరిష్కరానికి ప్రభుత్వం గ్రామజనాభా నిష్పత్తి ప్రకారం నిధులను విడుదల చేసిందని తెలిపారు. అదేవిధంగా పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయడం, హరితహారం మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవడం, గ్రామాల్లోని విద్యుత్ దీపాలకు సంబంధించిన మరమ్మతు పనులు త్వరతిగతిన పూర్తిచేయాలని తెలిపారు. కావున ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో పనులు చేపట్టేందుకు సర్పంచ్‌లు సహకరించాలని అన్నారు. ఈ 30 రోజుల ప్రణాళికలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ గట్టయ్య, ఎంపీడీవో కుమారస్వామి, ఇన్‌చార్జి తహసీల్దార్ జయచందర్, ఈవోపీఆర్డీ మహబూబ్ అలీ, పంచాయతీ కార్యదర్శి ఇన్‌చార్జి కార్తీక్, సర్పంచ్ కందుల శ్రీలత శ్రీను, వార్డు సభ్యులు రాజు, రజిత, పీ రిగన్‌రెడ్డి, సీహెచ్ స్వప్న, ఎస్ చంద్రకళ, రంజిత్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

యశ్వంతాపూర్ గ్రామం సందర్శన
జనగామ రూరల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామాల రూపురేఖలు మార్చేందుకు గ్రామ ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని యశ్వంతాపూర్ గ్రామంలో గ్రామ ప్రణాళిక కార్యక్రమం ఎలా అమలు జరుగుతుందో స్వయంగా వచ్చి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న ప్రజలు కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకకు ముందుకురావాలని, అప్పుడే గ్రామం అన్ని రంగాల్లో ముందుంటుందన్నారు. గ్రామాలకు ఎవరో వచ్చి బాగు చేస్తారని చూడకుండా మనమే కలసి బాగుచేసుకుంటే బాగుంటుందన్నారు. ప్రతీ వార్డులో ఆ వార్డు ప్రజలు ముందుకువచ్చి చెత్తచేదారం లేకుండా చేసుకుంటే దోమలు, ఈగలు లేకుండా ప్రశాంతంగా ఉంటుందన్నారు.

వడ్లకొండలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో ఎండీ హాసీం, ఆయా గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాల్లో గ్రామ ప్రత్యేక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు బొల్లం శారద, సర్పంచ్ గండి లావణ్యప్రవీణ్, మండల కోఆప్షన్ సభ్యుడు బొట్ల అమృతం, ఉప సర్పంచ్ పల్లవి, ప్రత్యేక అధికారులు రమేశ్, శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

77

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles