స్టేషన్‌ఘన్‌ఫర్‌ల్రో చోరీ


Tue,September 10, 2019 02:20 AM

స్టేషన్‌ఘన్‌ఫూర్‌టౌన్: మండల కేంద్రంలోని రైల్వేగేటు ప్రధాన రోడ్డు మా గార్డెన్ సమీపంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. ఎస్సై రవి కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని మా గార్డెన్ ఆవరణలో నివాసం ఉంటున్న కర్ణే రమేశ్ పాలకుర్తి మండలంలోని గూడూరు గ్రామంలో బంధువు చనిపోవడంతో కుటుంబ సభ్యులతో సోమవారం ఉదయం వెళ్లారు. తిరిగి రాత్రి ఇంటికొచ్చి గేట్ తీసి వచ్చే చూసే సరికి ఇంట్లోని తలుపుతాళం పగులగొట్టి ఉండడం గమనించి, అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో దొంగలు పడ్డారని, ఈ మేరకు బీరువాలోని 30 తులాల వెండి అపహరించారని ఆయన తెలిపారు. నగదు, బంగారం పోలేదని, కేవలం 30 తులాల వెండి వస్తువులు మాత్రమే పోయాయని ఎస్సై తెలిపారు. బాధితుడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ రవి తెలిపారు.

56

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles