ఎంసీహెచ్‌లో వైద్యసేవలు భేష్..


Tue,September 10, 2019 02:19 AM


జనగామ టౌన్, సెప్టెంబర్ 09: సాధారణ ప్రసవాలే లక్ష్యంగా ముందుకె ళ్తున్న జనగామ ఎంసీహెచ్‌లో వైద్యసేవలు బాగున్నాయని రాష్ట్ర వైద్య విభా గం పరిశీలకులు ఏ మాధురి, సీహెచ్ భ వాని తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి వచ్చిన బృందం సభ్యులు ఎంసీహెచ్‌లో అందుతున్న వైద్యసేవల ను తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా సర్జరీలు జరుగుతున్న దవాఖానల్లో సాధారణ ప్రసవాలు జరిపించేందుకు ప్రభుత్వ ఆ దేశాల ప్రకారం ఎంసీహెచ్ నుంచి ఆరుగురు వైద్యులు, వైద్యసిబ్బందికి హైదరాబాద్‌లో అవగాహన, శిక్షణ ఇచ్చారు.

ఈ నేపథ్యలో వారు గర్భిణులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ గర్భిణులు దవాఖానకు వస్తే ఆపరేషన్లకు బదులు నార్మల్‌గా డెలివరీ అయ్యేలా వివిధ కా ర్యక్రమాలను చేపడుతుందన్నారు. భాగంగా జనగామ ఎంసీహెచ్‌లో గతంలో ఆపరేషన్‌ల సంఖ్య అధికంగా ఉండగా, ప్రస్తతం ఆ సంఖ్య పూర్తిగా త గ్గినట్లు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎక్కువగా సాధారణ ప్రసవాలే చేస్తున్నారని, ఇందుకుగాను వైద్యులను అభినందిస్తున్నట్లు తెలిపారు. కా ర్యక్రమంలో హైదరాబాద్ బృందంతో పాటు ఎంసీహెచ్ పర్యవేక్షకుడు డాక్టర్ పూజారి రఘు, ఆర్‌ఎం వో డాక్టర్ సుగుణాకర్‌రాజు, వైద్యులు డాక్టర్ ప్రణతి, స్వప్నరాథోడ్, రజిని, సునీల్, చంద్రమౌళి సిబ్బంది పాల్గొన్నారు.

39

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles