పల్లెల అభివృద్ధి కోసమే ప్రణాళికలు


Mon,September 9, 2019 12:13 AM

రఘునాథపల్లి, సెప్టెంబర్‌ 07: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, వాటిని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వం 30 రోజులు కార్యాచరణ ప్రణాళికను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే డాక్టర్‌ తా టికొండ రాజయ్య అన్నారు. మండలంలోని గోవర్దనగిరిలో శనివారం నిర్వహించిన గ్రామసభకు ప్రత్యేక అ ధికారి రీనావతి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య హాజరై మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలోని పల్లెలు దేశంలోనే ఆదర్శంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ సమగ్ర గ్రామాభివృద్ధికి రూపకల్పన చేశారని అన్నారు. 30 రోజుల్లో ప్రధానంగా ఐదు అంశాల పై దృష్టి సారించాలని, అందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని కో రారు. పరిశుభ్రత, పచ్చదనం, విద్యుత్‌ వాడకం, సం పూర్ణ అక్షరాస్యత, ఆరోగ్యంపై అవగాహన పెంపొందిం చాలని సూచించారు. గ్రామసభల్లో సర్పంచ్‌లు ఆయా గ్రామాల్లో ఉన్న ఎన్నారైలు, గ్రామస్తుల ద్వారా విరాళాలు సేకరించి అభివృద్ధి చేసుకోవాలని కోరారు. దాతల పేర్లను గ్రామ పంచాయతీ వద్ద నోటీస్‌ బోర్డుపై ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలిపారు. సభలో గ్రామంలో తాగు, సాగు నీరుకు ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు.


మండలంలోని కో మాల్ల, గోవర్దనగిరి, కుర్చపల్లి గ్రామాల్లోని చెరువులను నింపేందుకు గతంలో కొన్ని నిధులు కేటాయించామ ని, ఆ నిధులతో పని జరుగలేదని త్వరలోనే ప్రత్యేక ని ధులతో పనులు పూర్తి చేసి చెరువులను నింపుతామని హామీ ఇచ్చారు. రూ. 50 వేల కోట్లతో కాళేశ్వరం ప్రా జెక్టు నిర్మాణం జరిగిందని, దీంతో 365 రోజులు చెరువులను నింపే అవకాశం ఉందన్నారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, యూత్‌ నాయకులు గ్రామాభివృద్ధికి సహరించాలని కోరారు. పార్టీలకు అతీతంగా పల్లెల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ పా టుపడుతూ దేశంలోనే నంబర్‌ వన్‌ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడని గుర్తు చేశారు. పలువురికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల వరలక్ష్మి, జెడ్పీటీసీ బొల్లం అజయ్‌, సర్పంచ్‌ శంకరి అనిత శ్రీనివాస్‌, తహసీల్దార్‌ తిరుమలాచారి, ఎంపీడీవో వసుమతి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల కుమార్‌గౌడ్‌, కార్యదర్శి ముసిపట్ల విజయ్‌కుమార్‌, గ్రామ అధ్యక్షులు బండి కుమార్‌, జనగామ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ నామాల బుచ్చయ్య, టీఆర్‌ఎస్‌ మహిళ విభాగం మండల అధ్యక్షురాలు మడ్లపల్లి సునిత పాల్గొన్నారు.

57

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles