కార్యకర్తలను కాపాడుకుంటా..

Thu,August 22, 2019 02:26 AM

స్టేషన్‌ఘన్‌ఫూర్‌టౌన్ : స్టేషన్‌ఘన్‌ఫూర్ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన టీఆర్‌ఎస్ మండల, అనుబంధ కమిటీల నియామక పేర్ల జాబితాను స్వీకరించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి మండల పార్టీ అధ్యక్షుడు పోగుల సారంగపాణి అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వ నమోదాలను పూర్తిచేసి దేశంలోనే రికార్డును సృష్టించామన్నారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఇప్పటి వరకు 50 వేలకు పైగా పార్టీ సభ్యాత్వాలను నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. పార్టీ శ్రేణులు అకుంఠిత దీక్షతో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు సీఎం కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు విధేయులుగా ఉండాలని ఆయన కోరారు. సీఎం కేసీఆర్ చలువతో స్టేషన్‌ఘన్‌ఫూర్ నియోజకవర్గంలో దేవాదుల నుంచి ఒక లక్ష 50 వేల ఎకరాలకు సాగు నీరును అందిస్తున్నామని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఏ నియోజకవర్గంలో లేని విధంగా రైతులకు సాగునీరును అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో చెరువులను నింపాలని విజ్ఞప్తులు వస్తున్నాయని, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులతో ఒక ప్రణాళికను తయారుచేసుకుని ప్రతిపాదించాలని ఎమ్మెల్మే కోరారు.

ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మార్గదర్శకాలు నిర్ధేశించారని, ఆమేరకు నవాబుపేట రిజర్వాయర్, గుండాల మండలానికి, లింగాల ఘనపురం మండలానికి దేవాదుల నీటిని అందించేలా చర్యలు చేపడుతామని ఆయన పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, అనుబంధ కమిటీల ఎన్నిక కసరత్తు కోసం వచ్చిన అభ్యర్థుల పేర్లను మూడు రోజుల్లోగా ఆన్‌లైన్ చేయాలని, గ్రామాల వారీగా వచ్చిన గ్రామ అధ్యక్షులు, అనుబంధ కమిటీల ఎన్నిక కోసం వచ్చిన పేర్లను సైతం ఆన్‌లైన్ చేయాలని ఆయన కోరారు. ఈ ఆన్‌లైన్ ప్రక్రియ మూడు రోజుల్లోగా ముగుస్తుందన్నారు. త్వరితగతిన మండల, గ్రామ కమిటీల కోసం ఇచ్చిన పేర్లలో మూడు రోజుల్లోగా ఆన్‌లైన్ చేస్తే వారికి బీమా వర్తిస్తుందని, తదుపరి వచ్చిన పేర్లకు బీమా వర్తించదని, దీనిని పార్టీ పరిశీలకులు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. స్టేషన్‌ఘన్‌ఫూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ శ్రేణులు అంకితభావంతో పనిచేయాలని ఆయన కోరారు. రాజకీయంగా నియోజకవర్గంలో పునజర్మనిచ్చిన ప్రజలకు, సహకరించిన పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు తాను ఎల్లకాలం రుణపడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆయన హమీ ఇచ్చారు. అలాగే నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులకు, కార్యకర్తలకు రేపటి రోజుల్లో పార్టీ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని, అంతేకాకుండా వారికి అండగా నిలుస్తామని ఎమ్మెల్యే రాజయ్య హమీఇచ్చారు.

అనంతరం ఈనెల 25వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు లింగాలఘనపురం మండలంలోని నెల్లుట్ల గ్రామంలో నెల్లుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ సమర సర్ణోత్సవ కార్యమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2019 మహాకవి డాక్టర్ దాశరథి సాహిత్య పురస్కారాన్ని అందుకున్న అభినవ పోతనామాత్యులు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య అభినందన సన్మాన వేడుకలకుగాను ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యకు ఆహ్వానపత్రాన్ని అందజేశారు. అనంతరం పలు మండలాల్లో సభ్యత్వ నమోదును పూర్తిచేసిన జాబితాను సీఎం కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నివేదికను సమర్పించడానికి పుస్తక జాబితాను ఎమ్మెల్యే రాజయ్య ఆవిష్కరించారు. సమావేశంలో కొమురల్లి దేవస్థాన చైర్మన్ సేవెల్లి సంసత్, నియోజకవర్గ నాయకులు గుడి వంశీధర్‌రెడ్డి, ఆకుల కుమార్, జెడ్పీటీసీ మారపాక రవి, కర్ర సోమిరెడ్డి, నెల్లుట్ల రవీందర్‌రావు, గుండ్రేటి రాజేశ్వరెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లా కోఆప్షన్ సభ్యురాలు జుబేదలాల్ మహ్మద్, ఎంపీపీ కందుల రేఖగట్టయ్య, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు తాటికొండ సురేశ్‌కుమార్, ఉపసర్పంచ్ ఐలయ్య, ఎంపీటీసీ నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజు, సత్యం, నాయకులు కవిత, లక్ష్మి, డాక్టర్ జగన్, డాక్టర్ కుమార్, వెంకటస్వామి, శ్రీనివాస్, రమేశ్, రాజయ్య, మనోహర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles