ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంత ఉండాలి

Thu,August 22, 2019 02:25 AM

జనగామ రూరల్, ఆగస్టు 21: గ్రామాల్లోని ప్రతీ ఇంటి ఆవరణలో ఇంకుడుగుంత తప్పనిసరిగా ఏర్పాటుచేసుకోవాలని ఎంపీడీవో ఎండీ హాసీం అన్నారు. మండలంలోని గానుగుపహాడ్, ఎర్రకుంటతండా గ్రామాల్లో బుధవారం ఇంకుడు గుంతల పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హసీం మాట్లాడుతూ నీటి నిల్వలు పెంచుకునేందుకు ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. అలాగే హరితహారంలో నాటిన మొక్కలను రక్షించుకునేలా ప్రజలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సానబోయిన శ్రీనివాస్, ఎంపీటీసీ రెడ్డబోయిన పద్మ, ఏపీవో చిక్కుడు భిక్షపతి, టీఏ అనిల్, ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles