హరితహారాన్ని విజయవంతం చేయాలి

Thu,August 22, 2019 02:25 AM

జఫర్‌ఘడ్ : హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేయాలని డీఆర్‌డీవో రాంరెడ్డి అన్నారు. మండలంలో ని కోనాయిచలం, రేగడితండా లను సందర్శించి, నర్సరీలను, జలశక్తి అభియాన్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధిహామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో మొక్కలను నాటి, వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీధర్‌స్వామి, ఈవోపీఆర్డీ సురేశ్, ఉపాధిహామీ ఏపీవో ఇందిర, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles