గులాబీ జెండా ఎగురేద్దాం

Wed,August 21, 2019 04:16 AM

జనగామ, నమస్తే తెలంగాణ, ఆగస్టు 20: త్వరలో జరిగే ఎన్నికల్లో పట్టణంలోని 30 వార్డులను కైవసం చేసుకొని, జనగామ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేసేలా పట్టణ వార్డు, అనుబంధ కమిటీల కార్యవర్గాలు పని చేయాలని టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని 23వ వార్డులో ఎన్నికల ఇన్‌చార్జి మేకల కళింగరాజు, 16వ వార్డులో తాళ్లపెల్లి పోచయ్య, 7వ వార్డులో పిట్టల రాజు, 28వ వార్డులో భూరెడ్డి ప్రమోద్‌రెడ్డి ఆధ్వర్యంలో వార్డు ప్రధాన కమిటీ కార్యవర్గం సహా అనుబంధ కమిటీల ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. టీఆర్‌ఎస్ నుంచి కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేసే వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత వార్డు కమిటీల కార్యవర్గంపై ఉంటుందని, అన్ని స్థానాల్లో గెలిపించుకుంటే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సహకారంతో పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. 7వ వార్డు అధ్యక్షుడిగా దామెర రాజు, ప్రధాన కార్యదర్శిగా జాయ శ్రీశైలం, ఉపాధ్యక్షుడిగా నోముల వీరస్వామి, యూత్ అధ్యక్షుడిగా గొడిగె భరత, బీసీసెల్ అధ్యక్షుడిగా నాగులపల్లి అశోక్, మహిళా అధ్యక్షురాలిగా బొరెల్ల సువర్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడు రాజుకు మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నియామకపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు పసుల ఏబెల్, కన్న పరశురాములు, జిట్ట శ్రీశైలం, జూకటి శ్రీశైలం, నాగులపల్లి శ్రీశైలం, రావుల లక్ష్మణ్, కరణ్‌కోట్ భారత్ పాల్గొన్నారు.

23వ వార్డులో ఎన్నికల ఇన్‌చార్జి, జనగామ ఎంపీపీ మేకల కళింగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో వార్డు గౌరవ అధ్యక్షుడిగా గోరట్ల సత్యం, అధ్యక్షుడిగా రాయారపు భిక్షపతి, ఉపాధ్యక్షుడిగా లకావత్ హరిసింగ్‌జాదవ్, కార్యదర్శిగా నిడిగొండ మహేందర్, సంయుక్త కార్యదర్శిగా మిద్దెపాక భాస్కర్, కోశాధికారిగా మిద్దెపాక రాజుకుమార్, బీసీసెల్ అధ్యక్షుడిగా చుంచు నర్సయ్య, కార్యదర్శిగా నిడిగొండ మహేశ్, ఎస్సీసెల్ అధ్యక్షుడిగా బొంకూరి జయానందం, కార్యదర్శిగా మైసి శ్రీకాంత్, యూత్ అధ్యక్షుడిగా నాయిని సంతోష్, కార్యదర్శిగా బొబ్బాల రాజు, మహిళా అధ్యక్షురాలిగా గంగుల సునీ, కార్యదర్శిగా కొలనుపాక శైలజ, ఎస్టీ కమిటీ అధ్యక్షుడిగా గుగులోత్ నరేందర్, కార్యదర్శిగా కొర్ర నాగన్, మైనార్టీ అధ్యక్షుడిగా ఎండీ జాంగీర్, కార్యదర్శి అక్బర్ ఎన్నికయ్యారు. 16వ వార్డు కమిటీ ఎన్నికలు పంతుల ప్రభాకర్‌రావు, నర్సిరెడ్డి, దయాకర్, రఫీక్, తుంగ సతీశ్ ఆధ్వర్యంలో జరిగాయి. వార్డు అధ్యక్షుడిగా దేవులపల్లి కిశోర్, ప్రధాన కార్యదర్శిగా పుట్ట రామకృష్ణ, మహిళా అధ్యక్షురాలిగా గోరంతల భూలక్ష్మి, బీసీసెల్ అధ్యక్షుడిగా దుస్సా కుమారస్వామి, మైనార్టీ అధ్యక్షుడిగా అబ్దుల్ జబ్బార్ ఎన్నికయ్యారు. 28వ వార్డు అధ్యక్షుడిగా జంగిటి భాస్కర్‌రావు, ఉపాధ్యక్షుడిగా ఎండీ లతీఫ్ షరీఫ్, కార్యదర్శిగా ఎండీ మసిఉర్ రహమాన్, సంయుక్త కార్యదర్శిగా మేడ స్వరూప్‌రాజ్, కోశాధికారిగా ఎర్ర జోసఫ్ ఎన్నికయ్యారు.

కార్యక్రమంలో తాళ్లపల్లి రాజేశ్వర్, జంగిటి భాస్కర్, బొడ్డు రంజిత్, బింగి మల్లేశ్, ఇమ్రాన్, సోహెల్ పాల్గొన్నారు. 26వ అధ్యక్షులుగా చల్లోజు ఆంజనేయులు, యూత్ అధ్యక్షుడిగా వంగ రాకేశ్, మహిళా అధ్యక్షురాలిగా పేరం స్వాతి, ఉపాధ్యక్షురాలిగా గౌరగల్ల జ్యోతి, ప్రధాన కార్యదర్శిగా మద్దోజు రాణి, కోశాధికారిగా కడారి నవనీత ఎన్నికయ్యారు. కార్యక్రమంలో వార్డు ఎన్నికల ఇన్‌చార్జి బావండ్ల కృష్ణంరాజు, మద్దోజు గంగాభవనీ, గంగిశెట్టి ప్రమోద్‌కుమార్, యాసోజు నాగరాజు, సూతారి ఆంజనేయులు, ఇమ్రాన్, చాన్‌పాషా, అనిత, యాదమ్మ, సువర్ణ, పద్మ, అరుణ, అండాలు, వాణి, మల్లవ్వ, కోమలత, సుగుణమ్మ పాల్గొన్నారు. 9వార్డు అధ్యక్షుడిగా అహ్మద్ అలీ, ఉపాధ్యక్షులుగా గుండా సిద్ధిరాములు, గొట్టం శంకర్‌రెడ్డి, కార్యదర్శిగా తాడూరి శ్రీనివాస్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా గొంగిడి లక్ష్మణ్, కోశాధికారిగా ఎండీ నజీర్, మహిళా అధ్యక్షురాలిగా ఆకునూరి రమ్య, ఉపాధ్యక్షులుగా మార్క యాదలక్ష్మి, దండు రాములు, కార్యదర్శిగా గోగికార్ రజనిబాయి, సంయుక్త కార్యదర్శిగా కుసుమ రాజేశ్వరి, కోశాధికారిగా రజని, యూత్ అధ్యక్షుడిగా ఆలేటి జహంగీర్, ఉపాధ్యక్షుడిగా గోగికారి అశ్విన్‌కుమార్, కార్యదర్శిగా రాజేశ్, సంయుక్త కార్యదర్శిగా సల్మాన్, కోశాధికారిగా వేణు, బీసీ అధ్యక్షుడిగా మహేశ్వరం శోభన్, ఉపాధ్యక్షుడిగా ఎనగందుల నర్సింహులు, కార్యదర్శిగా బైరు రాజ్‌కుమార్, సంయుక్త కార్యదర్శిగా ఆకోజు సోమాచారి, కోశాధికారిగా నాయిని ప్రకాశ్‌రావు, మైనార్టీసెల్ అధ్యక్షుడిగా అబ్దుల్లా, ఉపాధ్యక్షుడిగా దస్తగిర్, కార్యదర్శిగా అఫ్జల్, సంయుక్త కార్యదర్శిగా చాంద్‌పాషా, కోశాధికారిగా ముజాయిద్ ఎన్నికయ్యారు.

వార్డు ఎన్నికల ఇన్‌చార్జి బుడిగం చంద్రారెడ్డి, ఆకునూరి వెంకన్న, జిట్టె శ్రీశైలం, సుగుణాకర్ పాల్గొన్నారు. అదేవిధంగా 21వ వార్డు కమిటీని ఎన్నిక ఇన్‌చార్జి నీరటి సుధాకర్, పోకల లింగయ్య, ఎండీ గౌస్ ఆధ్వర్యంలో ప్రకటించారు. అధ్యక్షుడిగా గాయకోటి సంపత్, ఉపాధ్యక్షుడిగా ఐల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కొలిపాక నర్సింహులు, మహిళా అధ్యక్షురాలిగా సాంబ శివజ్యోతి, యూత్ అధ్యక్షుడిగా పంగి సందీప్, బీసీసెల్ అధ్యక్షుడిగా కనికరం కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులుగా మాచర్ల ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు చిలువేరు గోవర్ధన్, ఉల్లెంగు కృష్ణ, శానబోయిన ఉమేశ్, కూరగాయల శ్రీనివాస్, జిట్ట శ్రీశైలం, దామెర రాజు, ఉల్లెంగుల సందీప్ పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles