రోటా వ్యాక్సిన్‌పై వైద్యసిబ్బందికి శిక్షణ

Wed,August 21, 2019 04:16 AM

జనగామ టౌన్ : రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో రోటా వ్యాక్సినేషన్ అమలు విధానముపై జిల్లా ప్రధాన దవాఖానలో ఏఎన్‌ఎంలకు మంగళవారం శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇముయనైజేషన్ అధికారి రాములు అధ్యక్షత వహించగా ఏఎన్‌ఎంలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. ఈమేరకు వారందరికీ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి చిన్నపిల్లలకు వచ్చే డయేరీయా వ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన అంశాలను ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. అలాగే ఈ వ్యాధిని గుర్తించే విధానంతో పాటు తీవ్రతలను ఏవిధంగా పరిశీలించాలనే అంశాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్‌కుమార్, డాక్టర్ ఛాయాదేవి, పూర్ణచందర్, ప్రభాకర్, సీహెచ్‌వో జైపాల్‌రెడ్డి, రాజశేఖర్, రవీందర్, వెంకటేశ్వర్లు, ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles