సంచార పశువైద్యశాల వాహనం తనిఖీలు

Wed,August 21, 2019 04:14 AM

స్టేషన్‌ఘన్‌ఫూర్‌టౌన్ : స్టేషన్‌ఘన్‌ఫూర్ మండల కేంద్రంలోని సంచార పశువైద్యశాలలో ఉన్న 1962 పశు ఆరోగ్యసేవ సంచార వాహనాన్ని మంగళవారం మధ్యాహ్నం జీవీకే ఈఎంఆర్‌ఐ ప్రోగ్రామ్ మేనేజర్ బత్తుల ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీచేశారు. వాహనంలో ఉన్న పశు ఆరోగ్య సేవలకు సంబంధించిన వైద్య పరీక్షల పరికరాలను ఆయన పరీశీలించారు. తనిఖీలో భాగంగా సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉన్నారా లేదా అని ఆయన పరిశీలించారు. అంబులెన్స్‌లో ఉన్న అత్యవసర మందుల పరిమాణం, కాలపరిమితి, అత్యవసర వైద్య పరికరాల పనితీరును ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం రోజూవారి రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా బత్తుల ప్రభాకర్ మాట్లాడుతూ.. 1962 సిబ్బంది విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలన్నారు. మూగ జీవులకు సేవలందిస్తున్న సిబ్బందికి తగు సూచనలు అందించామని తెలిపారు. రైతులు సంచార పశు వాహన సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జనగామ జిల్లా సమన్వయ కర్త వీ రాముతో పాటు 108 అంబులెన్స్ సిబ్బంది, 1962 సిబ్బంది పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles