రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తాం..

Wed,August 21, 2019 04:14 AM

కొడకండ్ల : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనలో రైతులు ఫిర్యాదు చేయాలని, సమస్యలుంటే వెంటనే పరిష్కరిస్తామని స్టేషన్ ఘన్‌పూర్ ఆర్డీవో ఎల్ రమేశ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో కోర్టు పరిధిలో ఉన్న సమస్యలపై ఆయన బాధితులతో చర్చించారు. అనంతరం ఆర్డీవో విలేకరులతో మాట్లాడుతూ.. కోర్టు పరిధిలో సమస్యలను ఆయా మండలాల్లోనే పరిష్కరిస్తున్నామని అన్నారు. రైతులు డివిజన్ కేంద్రాలకు రావడం వల్ల సమయం, రవాణా ఖర్చులను తగ్గించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా మండలాల్లోనే కేసులను పరిష్కరిస్తున్నామని అన్నారు. కొడకండ్ల మండలంలో ముఖ్యంగా మొండ్రాయి గిర్నితండా, మైదంచెరువు తండా, రామవరం గ్రామాల్లో ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయని అన్నారు. భూ సమస్యలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని, వెంటనే పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహ్మద్, డీటీ శంకర్, మాన్యానాయక్, సీనియర్ అసిస్టెంట్ భద్రయ్య, వీఆర్‌వో రోహిత్‌రెడ్డి, నరేశ్‌గౌడ్, రవీందర్, పర్శరాములు, తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles