వినోద్‌కుమార్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు

Wed,August 21, 2019 04:14 AM

అర్బన్ కలెక్టరేట్ : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా నియమితులైన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను ఉద్యోగ సంఘాల నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి శాశ్వత ప్రణాళికల రూపకల్పనలో కొత్త ఒరవడిని స్పష్టించాలన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు కార్యరూపం ఇస్తూ బంగారు తెలంగాణ వైపు వినోద్‌కుమార్ అడుగులు వేస్తారన్నారు. టీజీవో వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఎ.జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేందుకు వినోద్‌కుమార్ కృషి చేస్తారన్నారు. వినోద్‌కుమార్‌ను కలిసిన వారిలో టీజీవో జనగాం జిల్లా అధ్యక్షుడు అంజాద్ అలీ, రాష్ట్ర కార్యదర్శి హసనొద్దీన్, రాజేంద్రప్రసాద్ తదితరులున్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles