పాఠశాలల్లో డీఈవో తనిఖీలు

Wed,August 21, 2019 04:13 AM

దేవరుప్పుల : దేవరుప్పులలోని పలు పాఠశాలలను మంగళవారం జిల్లా విద్యాధికారి యాదయ్య ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాలల ప్రగతిని పరిశీలించారు. పాఠశాలల ప్రారంభ సమయానికి వెళ్లిన డీఈవో ధరావత్‌తండా ప్రాధమిక పాఠశాలలో ప్రార్ధనకు హాజరయ్యారు. అనంతరం ధర్మగడ్డతండా ప్రాధమికోన్నత పాఠశాల, మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో వసతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పాఠశాలల్లో అమలవుతున్న ఏబీసీ మూలాల్లోకి వెళదాం కార్యక్రమ తీరును పరిశీలించామని, బోర్డుపై ప్రశ్నలతో విద్యార్థుల ప్రగతిని సమాధానాల రూపంలో రాబట్టామన్నారు. ఇక కేజీవీబీలో 50 శాతం కన్న ఎక్కువ ఉపాధ్యాయులు సెలవుపై ఉండడంతో ప్రత్యేకాధికారిని మందలించారు. అనంతరం భోజనశాల, స్టోర్ రూంలను పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, శుభ్రత పాటించాలని సూచించారు. డీఈవో వెంట ఎంఈవో మేకల రవికుమార్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles