చిన్నపెండ్యాలలో అటవీశాఖాధికారులకు..

Tue,August 20, 2019 03:22 AM


చిలుపూర్ : మండలంలోని చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన బయ్య వెంకన్న అనే రైతుకు సోమవారం నెమలి (జాతీయపక్షి) దొరకగా అటవీ అధికారులకు అప్పగించాడు. వివరాలు.. చిన్నపెండ్యాలకు చెందిన బయ్య వెంకన్న తన వ్యవసాయ బావివద్దకు వెళ్లగా బావి వద్ద ఉన్న చెట్ల పొదల్లో నెమలి తచ్చాడుతుండగా చూశాడు. కుంటుతూ నడుస్తున్న నెమలిని చూసి కాలుకు దెబ్బ తగిలినట్లు గుర్తించిన వెంకన్న ఆ నెమలిని గ్రామంలోకి తీసుకెళ్లాడు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా వారు వచ్చి నెమలిని తీసుకువెళ్లినట్లు వెంకన్న తెలిపారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles