ఇర్రి రమణారెడ్డికి మంత్రి నిరంజన్‌రెడ్డి అభినందనలు

Tue,August 20, 2019 03:20 AM

బచ్చన్నపేట : జనగామ జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డిని సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అభినందించి సన్మానించారు. హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన వ్యవసాయశాఖకు సంబంధించిన కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డికి మంత్రి నిరంజన్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించడంలో ముందుండాలని సూచించారని రమణారెడ్డి తెలిపారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles