అధికారుల సమీక్షలో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి

Sun,August 18, 2019 03:39 AM

జనగామ, నమస్తే తెలంగాణ, ఆగస్టు 17: జిల్లాలో భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని వందశాతం పూర్తి చేసి ఏ ఒక్క ఫిర్యాదు పెండింగ్‌లో లేకుండా చూడాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం రెవెన్యూ శాఖతోపాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో మండలాలు, గ్రామాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 26న మరోసారి జరిగే సమీక్ష నాటికి కేసుల వారీగా నివేదిక, ఫిర్యాదులు.. వాటి పరిష్కార మార్గాలతో సంబంధిత శాఖల సూపరింటెండెంట్లు హాజరు కావాలని ఆదేశించారు. ప్రతీ శాఖలోని ఆర్టీఏ, మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ నివేదికలు, వాటికి ఇచ్చిన సమాధానాలతో హాజరు కావాలని సూచించారు. పట్టాదారు పాసుపుస్తకాల కోసం రెవెన్యూ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్‌లో రూపొందించిన ప్రత్యేక యాప్.. దాని పనితీరు, పాస్‌బుక్ జారీ చేసిన తర్వాత జేసీ, ఆర్డీవోలు, తహసీల్దార్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే విధానం, దాన్ని ఉపయోగించే తీరు, యూజర్ ఐటీ, పాస్‌వర్డ్‌పై జిల్లా మేనేజర్ గౌతంరెడ్డి వివరించారు. సమావేశంలో జేసీ ఓజే మధు, ఆర్డీవోలు మధుమోహన్, రమేశ్, ఏజీపీ రాంగోపాల్, తహసీల్దార్లు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles