టీఆర్‌ఎస్ అభివృద్ధికి కృషి చేయాలి

Sat,August 17, 2019 03:04 AM

రఘునాథపల్లి, ఆగస్టు 16: టీఆర్‌ఎస్ అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని దాసన్నగూడెం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకులు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను హన్మకొండలోని ఆయన నివాసంలో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ అధ్యక్షుడు అరూరి కుమార్, మాజీ సర్పంచ్ బైరగోని బాబుతో పాటు గ్రామస్తులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉప సర్పంచ్ ఎంపాల జయమ్మ, నాయకురాలు తడకపల్లి భారతమ్మ, మల్లయ్య, సుభాశ్, నర్సయ్య, అంజయ్య, వెంకటయ్య, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

జఫర్‌ఘడ్‌లో..
జఫర్‌ఘడ్, ఆగస్టు 16 : మండలంలోని ఉప్పుగల్లు గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే రాజయ్యను శుక్రవారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో కలిసారు. వైస్ ఎంపీపీ కొడారి కనుకయ్య ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పులి ధనుంజయ్, వర్కింగ్ ప్రెసిడెంట్ డోలీ శ్రీధర్‌లు ఎమ్మెల్యే రాజయ్యను కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా, మండల నాయకులు గాదెపాక అయోధ్య, కోరుకొప్పుల రాజు, టీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles