సోదరభావానికి ప్రతీక రాఖీ..

Wed,August 14, 2019 01:20 AM

జనగామ, నమస్తే తెలంగాణ : సోదర భావానికి ప్రతీకగా రక్షా బంధన్ వేడుకలు నిలుస్తాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడి క్యాంపు కార్యాలయంలో బ్రహ్మకుమారీ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన రక్షాబంధన్ వేడుకలో ఇన్‌చార్జి బీకే విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సహా పలువురు టీఆర్‌ఎస్ నాయకులకు రాఖీలు కట్టి స్వీట్లు పంపిణీచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో తప్పుడు నడవడికలో పోకుండా సమాజహితం కోసం ఈలాంటి పండుగలు ఉన్నాయన్నారు. అనేక సందర్భాల్లో బ్రహ్మకుమారీలు ఉచితంగా చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జనగామ జెడ్పీటీసీ నిమ్మతి దీపిక మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, మాజీ కౌన్సిలర్ గజ్జెల నర్సిరెడ్డి, ఉల్లెంగుల కృష్ణ, మామిడాల రాజు తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles