మినీ స్టేడియం ముస్తాబు

Wed,August 14, 2019 01:19 AM

జనగామ, నమస్తే తెలంగాణ, ఆగస్టు 13: పంద్రాగస్టు వేడుకలకు జనగామ పట్టణంలోని ధర్మకంచ మినీ స్టేడియం ముస్తాబైంది. గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వర్ష సూచనతో యంత్రాంగం అప్రమత్తమై అందుకనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. సోమవారం నుంచే మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది పరేడ్ మైదానాన్ని శుభ్రం చేయగా, మంగళవారం సాయంత్రం పందిళ్లు వేసి జెండా గద్దెకు రంగులు అద్ది వేదికతోపాటు స్డేడియాన్ని సర్వంగసుందరంగా తయారు చేశారు. స్టేడియంలో పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ పర్యవేక్షించగా, బందోబస్తుకు సంబంధించి డీసీపీ శ్రీనివాసరెడ్డి సమీక్షించి.. ఆయన ధర్మకంచ మినీస్టేడియం ఆవరణలో పోలీసుల పరేడ్ రిహాల్సల్స్‌ను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.

ట్రాఫిక్‌కు సమస్య లేకుండా..
ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వేడుకలకు హాజరయ్యే వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పంద్రాగస్టు వేడుకలపై కలెక్టర్, డీసీపీ ఆయా శాఖల అధికారులతో సమీక్షించి, ఏర్పాట్లపై సలహాలు, సూచనలు చేశారు. వేడుకల సందర్భంగా ఎలాంటి చిన్న తప్పిదం జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పా ట్లు చేయాలని, వీఐపీలకు, సాధారణ ప్రజలకు వేర్వేరుగా మైదానంలోకి అనుమతి ద్వారాలు ఏర్పాటు చేయడం, వాహనాల పార్కింగ్ సమస్య లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఈ వేడుకల్లో జనగామ జెడ్పీ తొలి చైర్మన్‌గా ఎన్నికైన పాగాల సంపత్‌రెడ్డికి జాతీయ పతకాన్ని ఆవిష్కరించే అవకా శం దక్కింది. గురువారం ఉదయం 10 గంటలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి మార్చ్‌ఫాస్ట్ పరేడ్‌లో పాల్గొని 10.30 గంటలకు జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పొటో ఎగ్జిబిషన్, వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్‌ను తిలకించి ఉత్తమ సేవలు అందించిన జిల్లా అధికారులు, సిబ్బందికి అవార్డులు ప్రదానం చేస్తారు. తర్వాత వివిధ పాఠశాలల విద్యార్థుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమా లు ప్రదర్శన, కళాకారుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి చేతుల మీదుగా జిల్లాలో పని చేస్తున్న ఉత్తమ ఉద్యోగులు, కళాకారులకు అవార్డులు అందజేస్తారు. వేడుకల్లో కలెక్టర్, డీసీ పీ, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ టీ రాజయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు పాల్గొంటారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles