కమిషనరేట్ పరిధిలో సీఐల బదిలీ


Wed,August 14, 2019 01:19 AM

వరంగల్ క్రైం, ఆగస్టు 13: మావోయిస్టుల అణచివేతలో చురుగ్గా పని చేసిన సీఐలను నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలకు బదిలీ చేస్తూ నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ములుగు పర్యటనకు వచ్చిన డీజీపీ మహేందర్‌రెడ్డి ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంలో పని చేసే అధికారుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయని, ఈ క్రమంలో ఇంటలిజెన్స్ అధికారుల నివేదిక ప్రకారం కాజీపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అంబటి నర్సయ్య, ఇటీవలే టాస్క్‌ఫోర్స్‌కు బదిలీపై వచ్చిన కొత్త దేవేందర్‌రెడ్డి, సీఐడీ వరంగల్ రేంజ్ విభాగంలో పని చేస్తున్న బీ అతిరాంలను బదిలీ చేస్తూ ఉత్తర్వులలో పేర్కొన్నారు. అంబటి నర్సయ్య మహాదేవ్‌పూర్ సర్కిల్‌కు, దేవేందర్‌రెడ్డి ములుగు సర్కిల్‌కు, అతిరాంను కాటారం సర్కిల్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు బదిలీ అయ్యారు.

57

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles