బోనమెత్తిన ఎర్రబెల్లి దంపతులు

Wed,August 14, 2019 01:19 AM

కొడకండ్ల, ఆగస్టు 13: మండలకేంద్రంలోని కాలభైరేశ్వరస్వామి ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉషాదయాకర్‌రావు దంపతులు బోనం ఎత్తుకుని ముత్యాలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అతి పురాతన చరిత్ర కలిగిన కాలభైరేశ్వరస్వామి ఉత్సవాలను ఇక్కడి ప్రజలు వందల ఏళ్ల నుంచి గ్రామ పండుగగా జరుపుకుంటున్నారని తెలిపారు. దేవాలయ అభివృద్ధికి తాను అన్ని విధాలా సహకరిస్తాని ఇచ్చారు. కాగా, ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించినందుకు సర్పంచ్ పసునూరి మధుసూదన్‌తోపాటు పంచాయతీ పాలకవర్గాన్ని మంత్రి అభినందించారు. అంతకుముందు సర్పంచ్ మధుసూదన్ దంపతులు కాలభైరేశ్వరస్వామికి, ముత్యాలమ్మకు పట్టువస్ర్తాలు సమర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కుందూరి వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ ధరావత్ జ్యోతి రవీంద్రనాయక్, జెడ్పీటీసీ కేలోత్ సత్తమ్మ భిక్షపతినాయక్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు అందె యాకయ్య, మాజీ ఎంపీపీ రాము, ఎంపీటీసీ విజయలక్ష్మి, ఉప సర్పంచ్ రమేశ్, కో ఆప్షన్ మెంబర్ నసీర్, నాయకులు జక్కుల విజయమ్మ, వెంకట్ నారాయణ, పాంగు రంగం, శనిగరం కొమురయ్య, కుమార్‌గౌడ్, సతీష్‌గౌడ్, తహసీల్దార్ ఎంఏ అహ్మద్, ఎంపీడీవో డాక్టర్ రమేశ్, ఈవోపీఆర్డీ చంద్రశేఖర్, పీఆర్ ఏఈ కిరణ్‌కుమార్, ఏపీవో కుమారస్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles