భక్తి శ్రద్ధలతో బక్రీద్

Tue,August 13, 2019 03:55 AM

-ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు
-భూపాలపల్లి, గణపురంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి టౌన్, ఆగస్టు 12: ముస్లింలు ఎక్కువగా ఇష్టపడే పండుగ బక్రీద్ అని భూపాలపల్లి ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. బక్రీద్ పం డుగను పురస్కరించుకుని స్థానిక బాంబులగడ్డ ఈద్గా వద్ద ముస్లింలు సోమవారం ప్రార్థనలు చేశారు. వేకువజామునే స్నానాలు చేసి, చిన్నా, పెద్దా అందరూ ఈద్గా కు చేరుకొని నమాజ్‌లో పాల్గొన్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే రమణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. ఏఐఎఫ్‌బీ నేత గండ్ర సత్యనారాయణరావు సైతం నమాజ్ చేశారు. ఈ సందర్భంగా మజీద్ కమిటీ అధ్యక్షులు బాబుమియా ఆధ్వర్యంలో ముస్లింలు వారికి ఘనంగా స్వాగతం పలికి, చేతికి ఇమామెజానె కటి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ తరువాత ము స్లింలు అమితంగా ఇష్టపడే పండుగ బక్రీద్ అని తెలిపారు. హిందూ, ముస్లింలు ఐకమత్యంతో అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండాలని కోరారు. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో మజీద్ కమిటీ ఉపాధ్యక్షులు గౌస్, కోశాధికారి ఖజీర్, కమిటీ నేతలతో పాటు టీఆర్‌ఎస్ అర్బన్ అధ్యక్షులు క్యాతరాజు సాంబమూర్తి, నాయకులు చల్లూరి సమ్మయ్య, కొత్త హరిబాబు, శేషాల వెంకన్న, ఆకుల మల్లేశ్‌గౌడ్, మేనం తిరుపతి, బాబర్‌పాషా, సింగనవేని చిరంజీవి యాదవ్, అన్వర్, యాకుబ్‌అలీ, ముంజంపెల్లి మురళీధర్, రుక్మొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles