ముమ్మరంగా వాహనాల తనిఖీ

Tue,August 13, 2019 03:51 AM

వాజేడు, ఆగస్టు 12 : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన పేరూరు పోలీసుస్టేషన్ పరిధిలోని కృష్ణాపురం గ్రామం వద్ద 163 జాతీయ రహదారిపై సోమవారం ఎస్సై రాందేని స్వామి ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. బైక్‌లు, కార్లు నిలిపివేసి బ్యాగులు తీసి సోదా చేశారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఎటువంటి అనుమతి పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు. ఈ తనిఖీల్లో ఎస్సైతోపాటు సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

అనుమానితులను గ్రామాల్లోకి రానీయొద్దు : ఎస్సై
ఏటూరునాగారం, ఆగస్టు 12 : కన్నాయిగూడెం మండలం ఐలాపూర్ సమీపంలోని గొత్తికోయగూడెంలో సోమవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గొత్తికోయలకు వివిధ అంశాలపై ఎస్సై శ్రీకాంత్ కౌన్సెలింగ్ నిర్వహించారు. మావోయిస్టులకు సహకరించొద్దని సూచించారు. అనుమానితులకు గ్రామాల్లోకి రానీయొద్దన్నారు. ఇటీవల మావోయిస్టు కేసులో అరెస్టయిన తెల్లం అర్జున్ కుటుంబాన్ని ఎస్సై కలిశారు. రూ. 2వేల నగదును ఖర్చుల నిమిత్తం అందజేశారు. యువకులు పెడదారి పట్టకుండా తల్లిదండ్రులు గమనించాలని ఎస్సై కోరారు. ఈకార్యక్రమంలో సివిల్, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles