రెండు మోటర్లతో పంపింగ్

Tue,August 13, 2019 03:50 AM

ఏటూరునాగారం, ఆగస్టు 12 : గోదావరిలో వరద క్రమంగా తగ్గుతున్నది. దేవాదుల ఇన్‌టేక్ వెల్ వద్ద గోదావరి నీటి మట్టం సోమవారం సాయంత్రం 80.43మీటర్లు ఉంది. కాగా, దేవాదుల ఇన్‌టేక్ వెల్ వద్ద రెండో దశకు సంబంధించి మోటర్ ద్వారా పంపింగ్ కొనసాగుతుండగా సోమవారం ఉదయం మూడో దశలోని ఒక మోటర్‌ను ఆన్ చేశారు. ప్రస్తుతం ఇన్‌టేక్ వెల్ వద్ద రెండు మోటర్లతో భీంఘనపూర్ రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్ చేస్తున్నారు. కాగా, రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం తగ్గింది. ప్రస్తుతం 6.8మీటర్లు ఉంది.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles