బొగతకు పోటెత్తిన జనం

Tue,August 13, 2019 03:50 AM

వాజేడు, ఆగస్టు 12: బొగతకు జనం పోటెత్తారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో నాలుగు రోజులుగా వరుస సెలవులు రాగా, పర్యాటకులు జలపాతానికి వేలాది తరలివచ్చారు. సోమవారం బక్రీద్ సెలవు కాగా, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, సూర్యాపేట, కొత్తగూడెం, భద్రాచలం, కరీంనగర్, ములుగు, నిజామబాద్ తదితర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన పర్యాటకులతో బొగత పరిసరాలు కిక్కిరిశాయి. జలపాతం, చిల్డ్రెన్స్‌పార్క్, వాచ్‌టవర్ వద్ద పర్యాటకులు సెల్ఫీలు దిగారు. స్విమ్మింగ్‌ఫూల్‌లో స్నానాలు చేస్తూ మురిసిపోయారు. భోగాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేశారు. పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఎఫ్‌ఆర్వో డోలీ శంకర్ ఆధ్వర్యంలో జాలర్లు, రక్షణ బృందం సభ్యులు రక్షణ కల్పించారు. పర్యాటకుల వాహనాలతో పార్కింగ్ ప్రాంతం కిటకిటలాడింది. నూతనంగా ఏర్పాటు చేసిన జిప్ రైడింగ్ చేసేందుకు యువతీ యువకులు ఉత్సాహం చూపారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles