వనదేవతల సేవలో కలెక్టర్ దాలు అద్భుతం

Tue,August 13, 2019 03:49 AM

-హాస్యనటుడు ఫిష్ వెంకట్
వాజేడు, ఆగస్టు 12: బొగత జలపాతం అందాలు అద్భుతమని సినీ హాస్యనటుడు ఫిష్ వెంకట్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి బొగత జలపాతాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది స్నేహితులతో కలిసి బొగత వచ్చానని, ఇక్కడి జలపాతాన్ని చూసి మంత్రముగ్ధుడిని అయ్యానని చెప్పుకొచ్చారు. మేడారం సమ్మ క్క సారక్క తల్లులను ఏటా దర్శించుకుని బొగతను చూసేందుకు వస్తున్నట్లు తెలిపారు. గతంలో కంటే ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయని చెప్పారు. కొణిదెల వరుణ్‌తేజ్‌తో తాను నటించిన వాల్మీకి చిత్రం విడుదలకు సిద్ధంగా ఉందని, మరిన్ని సినిమాల్లో నటిస్తున్నట్లు వివరించారు. తన కుమారుడు సాయికుమార్ సైతం త్వరలో సినిమాలో నటించనున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. జలపాతాన్ని చూ సేందుకు వచ్చిన పర్యాటకులతో సెల్ఫీలు దిగి సందడిచేశారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles