నల్లూరికి ఉత్తమ ఆధునిక రైతు అవార్డు

Tue,August 13, 2019 03:49 AM

వెంకటాపురం (నూగూరు), ఆగస్టు 12: మండలంలోని రామచంద్రాపు రం గ్రామానికి చెందిన నల్లూరి వెంకన్నబాబు అనే రైతు ఉత్తమ ఆధునిక రైతు అవార్డు అందుకున్నారు. వివిధ రంగా ల్లో ప్రతిభ చూపిన వారికి శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి అవార్డులను ప్రకటించింది. సేవాసమితి 34వ వార్షిక వసంతోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా నల్లూరి అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సుప్రజ్యోతి పాల్గొన్నారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles