అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

Mon,August 12, 2019 04:03 AM

బచ్చన్నపేట, ఆగస్టు 11: అర్హులందరకీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడంలో ముందుంటానని మండల టీఆర్‌ఎస్ నాయకుడు చల్లా శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ గత సీమాంధ్ర పాలనలో గ్రామాలు అన్ని రంగాల్లో వెనుకబడి పోయాయన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో స్వరాష్ట్రం సాధించాక ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించాలన్న ఆశయంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అందుకే రైతన్నలకు నిండుగా కరెంటు, పంటలకు పెట్టుబడి సాయం, రైతుబీమా కింద మరణించిన రైతులకు రూ. 5 లక్షల ఆర్థికసాయం, ప్రతీ ఇంటికి పింఛన్లు, ఇంటింటికీ మిషన్‌భగీరథ నీళ్లు, ప్రతీ ఊరికి గోదావరి జలాలు అందించిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. ముఖ్యంగా కరువు మండలం అయిన బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాల చెరువులను గోదావరి జలాలతో నింపాలని ఆయన కోరారు. ఆయన వెంట నాయకులు బైరి బాలమల్లు తదితరులు ఉన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles