ఇద్దరి అరెస్ట్: సీపీ రవీందర్

Mon,August 12, 2019 04:02 AM

వరంగల్ క్రైం, ఆగస్టు 11: వరంగల్ నగరం హన్మకొండ సమ్మయ్యనగర్‌కు చెందిన సిరిగిరి వెన్నెల (15)పై సామూహిక లైంగిక దాడి ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వరంగల్ సీపీ విశ్వనాథ రవీందర్ తెలిపారు. దీనిపై ఆదివారం రాత్రి ఆయనొక ప్రకటన చేశారు. లైంగికదాడి అవమానంతో వెన్నెల ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులుండగా వీరిలో హసన్‌పర్తి మండలం పెంబర్తికి చెందిన తిరుపతితోపాటు మరో మైనర్ బాలుడిని అరెస్ట్ చేశామని ఆయన వెల్లడించారు. మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించేలా చూస్తామని రవీందర్ తెలిపారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles