పూర్తికావొస్తున్న భూరికార్డుల ప్రక్షాళన

Mon,August 12, 2019 04:02 AM

-భూ వివరాలు ధరణిలో నమోదు
స్టేషన్‌ఘన్‌ఫూర్, నమస్తే తెలంగాణ, ఆగస్టు11: సుమారు రెండేళ్లుగా భూరికార్డుల ప్రక్షాళన పనులను అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాల అనుగుణంగా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మండలంలో మొత్తం 13,492 ఖాతాలుండగా, సుమారు 11వేల ఖాతాలకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. అందులో 12,158 ఖాతాలు డిజిటల్ సంతకాలు పూర్తయ్యాయి. ఇందులో సుమారు 500 నాలా (వ్యవసాయేతరభూమి)గా గుర్తించారు. అదేవిధంగా 1334 ఖాతాలకు సంబంధించి వివాదాలు, ఎన్‌ఆర్‌ఐ ఖాతాలు, ఆధార్‌నమోదు చేయకపోవడం, సర్వే పూర్తిచేయకపోవడం వంటి వివిధ కారాణాలతో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఇన్‌చార్జి తహసీల్దార్ జయచందర్ ధరణి వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసి పాస్‌పుస్తకాలు భూ వివరాల నమోదును యుద్ధ ప్రతిపాదికన చేపడుతున్నారు. కొద్ది రోజులుగా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది ప్రత్యేకంగా ధరణి వెబ్‌సైట్‌లో వివరాలు, సవరణల నమోదుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు.

91శాతం పూర్తి
మండలంలో భూరికార్డుల సవరణ కార్యక్రమం 91 శాతం పూరైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మండలంలో 42,407ఎకరాల శిఖం, ప్రభుత్వ బంచరాయి, పట్టా భూములున్నట్లు ప్రక్షాళనలో భాగంగా గుర్తించారు. వీటికి సంబంధించి సుమారు 9నుంచి 10వేల ఎకరాలు ప్రభుత్వ భూమి, బంచరాయి భూములున్నట్లు అధికార వర్గాలు పెర్కోంటున్నాయి. మిగిలిన భూములకు సంబంధించి ఆయా ఖాతాల్లో సవరణను చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు రికార్డుల సవరణను శరవేగంగా చేపడుతుండటంతో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. దీంతో మిగిలిన 9శాతం రికార్డుల సవరణ త్వరలో పూర్తి కానుంది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసిన సభల ద్వారా వచ్చిన ఆర్జీల దరఖాస్తులను స్వీకరించి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు పక్రియను పూర్తి చేశారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles