బీమాతో కార్యకర్త కుటుంబానికి ధీమా

Sun,August 11, 2019 04:24 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ, ఆగస్టు 10: పార్టీకి పునాదులుగా భావించే కార్యకర్తలకు అండగా నిలిచేలా టీఆర్‌ఎస్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పడానికి నిదర్శనం సభ్యత్వ బీమా. టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్న సాధారణ, క్రియాశీలక కార్యకర్త ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి తమ వంతు సహకారం అందించేలా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు బీమా సౌకర్యాన్ని వర్తింపజేస్తున్నారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్త పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ వారి పేరున బీమా సౌకర్యం కల్పించేలా పార్టీ పక్షాన బీమా కంపెనీలకు డబ్బులు చెల్లిస్తున్నారు. తొర్రూరు మండలం జమస్తాన్‌పురం గ్రామానికి చెందిన ఎల్తూరి విద్యాకర్ ఇటీవల విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. మొదటి నుంచి టీఆర్‌ఎస్ కార్యకర్తగా కొనసాగుతున్న విద్యాకర్ పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకున్నాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మరణించడంతో ఆయన కుటుంబానికి పార్టీ భరోసా కల్పించింది.

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభివృద్ధి పనుల విషయంలో ఎంత బిజీగా ఉన్నా పార్టీ సభ్యత్వ నమోదు వ్యవహారంలో ఎప్పటికప్పుడు మండలాల వారీగా ఇన్‌చార్జులు, పార్టీ అధ్యక్షులు, ప్రధాన నాయకులతో సమీక్షలు నిర్వహిస్తూ రాష్ట్రంలోనే అత్యధిక పార్టీ సభ్యత్వ నమోదుతో పాలకుర్తి నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు ద్వారా కార్యకర్తలకు సైతం అండగా నిలిచారు. కాగా, మృతుడు విద్యాకర్ తల్లి సావిత్రికి శనివారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో రూ.2లక్షల చెక్‌ను అందజేశారు. పార్టీ సభ్యత్వ నమోదు పూర్తయి కొన్ని రోజులు గడుస్తుండగానే ప్రమాదవశాత్తు విద్యాకర్ చనిపోవడం వెంటనే ఆయన కుటుంబీకులకు రూ.2లక్షల బీమా సొమ్ము అందేలా మంత్రి దయాకర్‌రావు చొరవ తీసుకోవడంపై పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాకర్ తల్లి సావిత్రి టీఆర్‌ఎస్ పార్టీ అందించిన సహకారాన్ని, మంత్రి దయాకర్‌రావు చూపిన చొరవపై జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పింది. చెక్‌ను సావిత్రికి తొర్రూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, జమస్తాన్‌పురం సర్పంచ్ రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు రవి సమక్షంలో మంత్రి అందజేశారు.

టీఆర్‌ఎస్ నాయకుడికి మంత్రి పరామర్శ
డివిజన్ కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మాడ్గుల నట్వర్ అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతుండడంతో శనివారం పంచాయతీరాజ్‌శాఖ మంత్రి దయాకర్‌రావు ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాం క్షించారు. ఆయన వెంట దామోదర్‌రెడ్డి ఉన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles