ఎమ్మెల్యేను కలిసిన టీఆర్‌ఎస్ నూతన గ్రామ కమిటీ నాయకులు స్టేషన్‌ఘన్‌ఫూర్�

Sun,August 11, 2019 04:24 AM

స్టేషన్‌ఘన్‌ఫూర్‌టౌన్ : స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని ఇప్పగూడెం గ్రామ టీఆర్‌ఎస్ నూతన కమిటీ నాయకులు శనివారం హన్మకొండలోని ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజయ్యకు నాయకులు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా నూతన గ్రామ కమిటీ కార్యవర్గాన్ని ఎమ్మెల్యే రాజయ్య అభినందించారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో టీఆర్‌ఎస్ నూతన గ్రామ అధ్యక్షుడు ఎన్నకూస రాంనర్సయ్య, ఉపాధ్యక్షుడు ఎల్ వెంకటేశ్వర్లు, ఎం మదార్, ప్రధాన కార్యదర్శి ఎం ఎల్లాగౌడ్, సహాయ కార్యదర్శులు కత్తుల రాజు, కే రాములు, ఎన్ చిరంజీవి, కోశాధికారి పీ యాదవరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు అరుణ్, రాజశేఖర్‌రెడ్డి, గట్ట మల్లారెడ్డి, చట్ల యాకయ్య, జక్కుల పరుషరాములు, భానుచందర్, గట్టుమల్లయ్య, దైద ఇలిషన్, లింగయ్య, సతీష్ పాల్గొన్నారు.

చిలుపూర్ : మండలంలోని లింగంపల్లి టీఆర్‌ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రచ్చ రవీందర్‌ను నియమించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య శనివారం ప్రకటించారు. ఈసందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. శుక్రవారం ప్రకటించిన నూతన కమిటీ పేర్లలో లింగంపల్లి గ్రామానికి గంగుల సంపత్‌రెడ్డి పేరును ప్రకటించారు. కాగా ఆయనను మండల కమిటీకి తీసుకోనుండడంతో రచ్చ రవీందర్‌ను గ్రామ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు రాజయ్య వెల్లడించారు. ఈసందర్భంగా లింగంపల్లి నూతన గ్రామ అధ్యక్షుడు, నాయకులు ఎమ్మెల్యే రాజయ్యను కలిసి ఆయనను శాలువాతో సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్, కనకయ్య, శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు ఉన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles