అలీంపూర్ఎం పీటీసీకి సన్మానం

Sun,August 11, 2019 04:22 AM

బచ్చన్నపేట, ఆగస్టు 10: మండలంలోని అలీంపూర్ ఎంపీటీసీ సభ్యుడు ఎండీ మసూద్‌ను శనివారం సిద్దిపేట ఫ్రెండ్స్ గ్రూపు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన గ్రూపు సమావేశంలో ఇటీవల అలీంపూర్ నుంచి ఎంపీటీసీగా ఎన్నికైన మసూద్‌కు శాలువా కప్పి, పూలమాల వేసి మెమెంటో బహూకరించారు. ఈ సందర్భంగా గ్రూపు అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ డిగ్రీ చదువుకున్న వారమంతా ఒక గ్రూపుగా ఏర్పడి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో సభ్యుడైన మసూద్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని కొనియాడారు.

అదే స్ఫూర్తితో ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు భూమలింగం, ప్రభాకర్, షాదుల్లా, శ్రీనివాస్, సురేందర్‌రెడ్డి, బాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles